గృహహింస నిరోధక చట్టం తెచ్చిన చేటు
http://www.youtube.com/watch?v=aCkFH29xCOw&feature=player_embeddedఈ మధ్యకాలంలో భారతీయ గృహహింస నిరోధక చట్టం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఆ చట్టం బాధిత స్త్రీలకు ఉపశమనం కలిగిస్తుందని సాధారణ ప్రజల అభిప్రాయం. అయితే దాని దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆకాశరామన్న గారు తన దృక్కోణాన్ని ఈ వ్యాసం ద్వారా మనతో పంచుకుంటున్నారు.
A,B అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక తగాదా వచ్చి పడింది. దాన్ని పరిష్కరించమని మరో వ్యక్తి దగ్గరకి వెళ్ళారు. ఆ వ్యక్తి ఒక నిబంధన ప్రకారమే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధన ఏమిటంటే, తన వద్ద ఉన్న నాణేన్ని ఎగరేసి… వచ్చిన ఫలితం “బొమ్మ” అయితే — తీర్పు Bకి “వ్యతిరేకంగా” ఇవ్వాలి, అతీర్పు Bకి విపరీతమైన నష్టాన్ని, కష్టాన్ని కలిగించేదైనా పట్టించుకోనక్కర్లేదు. ఫలితం “బొరుసు” అయితే — తీర్పు A కి “ఎలాంటి నష్టం కానీ, కష్టం కానీ కలగకుండా” ఇవ్వాలి, వీలైతే అనుకూలంగా కూడా ఇవ్వచ్చు.
ఇదేం నిబంధనా? వచ్చిన ఫలితంతోగానీ, తప్పెవరిది అన్న నిజంతోగానీ సంబంధం లేకుండా Bకి వ్యతిరేకంగానే తీర్పువస్తుంది కాబట్టి దీనంతటి వివక్షాపూరితమైన నిబంధన ఇంకొకటి ఉండదు అని అంటారా..? సరే ఈ విషయాన్ని కాస్త పక్కనబెట్టి, స్త్రీల రక్షణకోసం చేయబడిన ఓచట్టాన్ని కాస్త పరిశీలిద్దాం.
గృహహింస నిరోధక చట్టం 2005 గృహహింస నిరోధక చట్టం ఒకసారి చదినవారు ఎవ్వరైనా, అసలు ఇలాంటి చట్టం ఒకటి రూపకల్పన చేయొచ్చా? చేసినా ఆమోదాన్ని పొందగలుగుతుందా అన్న సందేహాలు పొందకుండా ఉండడం అసంభవం. కానీ, ప్రస్తుత స్త్రీవాద ప్రపంచములో అది సాధ్యమేనన్న విషయం 2006 అక్టొబరులోనే అందరికీ అవగతమయింది.
అసలు గృహహింస అంటే ఏమిటి? ఈ చట్టం, స్త్రీలపై జరిగే శారీరక హింస, మానసిక హింస, లైంగిక హింస, ఆర్థికంగా జరిపే హింస, స్త్రీ ఆరోగ్యం, భధ్రతలకు విఘాతం కలిగించడం, కట్నము తెమ్మని వేధించడంలాంటివే కాకుండా, మాటలద్వారా కలిగే హింసను కూడా చేర్చి గృహహింస అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని కల్పించింది. ఇందులో బాదితురాలు కేవలం స్త్రీ మాత్రమే, ఆమె కుటుంబములోని ఏస్త్రీయైనా కావచ్చు. వారందరికీ ఈ చట్టం గృహహింసనుండి రక్షణ కల్పిస్తుంది. ఇవే కాకుండా ఇందులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఆంశము ఏమిటంటే స్త్రీకి నివాసపు హక్కును కల్పించడం. అంటే, ఆమె ఉంటున్న ఇల్లు ఆమెది కానప్పటికీ అందులోనుండి ఆమెను పంపించే వీలు లేదు. ఈ చట్టం, ఇది వరకు జరిగిన హింసే కాదు, భవిష్యత్తులో హింస జరిగే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. (Not only the actual abuse but also the threat of abuse too considered)
ఈ చట్టంపైనున్న అభ్యంతరాలేమిటి:
ఈ చట్టం అమలులోనికి వచ్చిన దగ్గరనుండి మొదలుకొని ఇప్పటి వరకూ దీనిమీద వెల్లువెత్తిన విమర్శలు బహుశా మరే చట్టం మీద వచ్చివుండవు. సామాన్యుడి దగ్గరనుండి అటార్నీ జనరల్ వరకూ ఈ చట్టాన్ని అందులోని కొన్ని ఆంశాలను తీవ్రంగా విమర్శించడం జరిగింది. అంతగా విమర్శలను ఎదుర్కొన్న ఈ చట్టంలో ఉన్న కొన్ని అంశాలు..
1. ఈ గృహహింస చట్టం ప్రకారం, స్త్రీ తాను చేసే ఆరోపణలకు ఎటువంటి సాక్షాధారం చూపించనవసరం లేదు. కేవలం ఆమె నోటిమాటనే సాక్షంగా స్వీకరించి, ప్రతివాదిని దోషిగా పరిగణిస్తుంది. ఆవిడ ఏమి చెప్పినా, అది నిజం కాదని ప్రతివాది నిరూపించేంత వరకూ, అది నిజంగానే చెలామని అవుతుంది. అంటే స్త్రీలందరూ సత్యం మాత్రమే పలికే సత్య హరిశ్చంద్రుని ఆంశ అని, దానికి వ్యతిరేకంగా నిరూపించబడే వరకూ భావించాలన్నమాట. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మగవాడిని స్త్రీ దయాదాక్షిణ్యాల మీద బతుకమని చెప్పడంలాంటిది.
2. ఇందులో గృహహింసకు ఇచ్చిన నిర్వచనాన్ని పరిశిలిస్తే, శారీరక హింస, ఆర్థికంగా జరిగే హింసల్లాంటివి జరిగాయనో/జరగలేదనో నిరూపించ వచ్చు. కానీ మానసిక హింసను, మాటలద్వారా కలిగే హింసను నిరూపించడం దాదాపుగా కుదరక పోవచ్చు. ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే, ఇటువంటి హింసలు స్త్రీలు నిరూపించలేకపోవడానికి కారణం వాటికి సరైన సాక్షాధారాలు చూపించడం కుదరకపోవడమే అని వాదించిన స్త్రీవాదులే, ఇప్పుడు అదే హింస జరగలేదని నిరూపించుకునే భాధ్యత పురుషుడిదే అని సెలవివ్వడం. కష్టం ఎవరికైనా కష్టమే కదా? మరి మగవారిపై ఎందుకంత వివక్ష?
3. ఈ చట్టం ప్రకారం, ప్రతివాది మీద కేసును భాదిత స్త్రీయే పెట్టనవసరంలేదు. ఎవ్వరైనా పెట్టవచ్చు. కావలసిందల్లా ఆ స్త్రీకి అది అవసరమని అవ్యక్తి భావిస్తేచాలు. అంటే, ఆమె బందువులు, స్నేహితులు, పక్కింటోల్లు, చివరకు ఆమె ప్రియుడు కూడా భర్త మీద గానీ, ఆ గృహంలోని మరోపురుషుడి మీద గానీ కేసును పెట్టొచ్చు. ఇంకోవిషయమేమిటంటే, ప్రస్తుతం వివాహబంధములో ఉన్న స్త్రీలే కాదు, విడాకులు పొందిన స్త్రీలు, సహజీవనం చేసే స్త్రీలు (Live – in relationships) కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకసారి, ఈరెండింటినీ కలిపి ఆలోచించండి, ఇవి పురుషుడి జీవితాన్ని ఎలాప్రభావితం చేస్తాయో? అసలు ఈ చట్టము దుర్వినియోగం జరుగుతుంది అంటే ఆశ్చర్య పోయే వారు బహుశా వీటిని చాలా కన్వీనియంట్‌గా విస్మరించడం జరుగుతోందని చెప్పొచ్చు.
4. ఈ చట్టములో ఉన్న ముఖ్య అంశాలలో ఒకటి స్త్రీకి నివాసపు హక్కును కల్పించడం. అంటే తాను నివసిస్తున్న ఇంటినుండి ఆమెను బయటకు పంపించే అధికారం ఎవ్వరికీ ఉండదు. అది అద్దె ఇల్లు అయినా సరే. ఒకానొక కేసులో సుప్రీం కోర్టు ఈ నివాసపు హక్కుపై స్పందిస్తూ, వివాహిత మహిళకు తన భర్త ఇంటిలోమాత్రమే అధికారం ఉంటుందని తేల్చిచెప్పి కొంత ఉపశమనాన్ని కలిగించడమే కాదు, ఈ చట్టం అత్యంత లోపభూయిష్టంగా కూర్చిన చట్టంగా (Losely drafted law) అభివర్ణించింది. దీన్ని స్త్రీవాదులు వ్యతిరేకించినా, సుప్రీం కోర్టు ముందు వారి ఆటలు సాగలేదు. మరో విషయం ఏమిటంటే, ఈ చట్టాన్ని ఉపయోగించి, ప్రస్తుతం జరుగున్న హింసనే కాదు, భవిష్యత్తులో జరిగే అవకాశమున్న హింసమీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈ రెండింటినీ కలిపితే మగవారి హక్కులకు తీవ్రవిఘాతమేర్పడుతోంది. ప్రతివాది కారణంగా తనకు ముప్పు పొంచి ఉంది అని వాదించి, అతని సొంత ఇంటినుండి అతన్ని వెల్లగొట్టవచ్చు. అంతే కాదు, అతను ఆమె నివసించే పరిసరప్రాంతాలకు రాకుండా నిరోదించ వచ్చు. ఒకవేల అతను దీన్ని అతిక్రమించినట్లు రుజువైతే అది క్రిమినల్ కేసూవుతుంది. దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.
5. అసలు వీటన్నింటికన్నా అతిపెద్ద దారుణమేమిటంటే, గృహహింస అంగానే భాదితులు కేవలం స్తీలు మాత్రమేనని, మగవారు ప్రతివాదులు మాత్రమే అనే అభిప్రాన్ని బలపరిచేలా ఒక చట్టం చేయడం. అసలు సిసలైన వివక్షకు నిదర్శనం. స్త్రీల హక్కులన్నీ మానవహక్కులే అనేవాళ్లు, పురుషుల హక్కుల విషయములో చూపించిన హ్రస్వదృష్టికి నిదర్శనం. ఇది అంతర్జాతీయ మనవహక్కుల నిభందనలకేకాదు, మన రాజ్యాంగములోని సమానత్వ సిద్దాంతాలను కూడా తుంగలో తొక్కుతోంది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా జరిగిన అనేక పరిశోధనలలొనూ, అధ్యయణాలలోను తేలిన విషయమేమిటంటే, గృహహింస అనేది ఏఒక్కరికో సంభందించినది కాదు. స్త్రీలు, పురుషులు ఇద్దరూ గృహహింసకు లోనవుతున్నారన్నరని, స్త్రీలు మగవారితో సమానంగా, కొన్నిసార్లు మగవారికన్నా ఎక్కువ అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తారని నిరూపించబడింది. శారీరకంగా స్త్రీ బలహీనురాలైనప్పటికి దాన్ని ఏదైన ఒక వస్తువుని విసరడము ద్వారా కానీ, మరేదైనా ఆయుధాన్ని ఉపయోగించడం ద్వారాకానీ స్త్రీలు అధిగమిస్తున్నారని తేల్చింది. మరి స్త్రీలనగానే బాధితురాలు, పురుషులు అనగానే హింసించే వారు అనడం వివక్ష కాక మరేమిటి? గృహహింస పట్ల, మగవారి పట్ల సమాజములో ఉన్న దృక్పథాన్ని (అపోహలను) అద్బుతంగా చిత్రీకరించిన ఈ విడియోని ఒక సారి చూడండి.
6. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిన స్త్రీలకు ఎటువంటి శిక్షా ఉండదు. అంటే ఇది దుర్వినియోగం చెయ్యండని వారిని ప్రోత్సహించడమే. ఇవే కాదు, గృహహింస నిరోధక చట్టం గురించి ఇంకా చాలా రాయొచ్చు. విశేషమేమిటంటే చట్టం దుర్వినియోగమె కాదు, సద్వినియోగమే జరిగినా అది కొన్నిసార్లు మగవారి హక్కులకు తీవ్రవిఘాతం కలిగించడం అత్యంత శోచనీయం.
ఇప్పుడు మనం వ్యాసం మొదట్లో చెప్పుకున్న, నాణేన్ని ఎగరేసి తీర్పు ఇచ్చే నిభందనను ఒక సారి పరిశిలిద్దాం. ఇక్కడ ఉన్న గొప్పవిషయమేమిటంటే, A,B ఇరువురికీ తమకు న్యాయం చేయమని కోరే హక్కువుంది. కానీ మన చట్టములో ఆ అవకాశం ఉండదు. A,Bలిద్దరిలో ఎవ్వరైనా తమ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేలేవరకూ నిర్దోషిగానే ఉంటారు. కానీ ఘణత వహించిన ఈ స్త్రీ సంరక్షణ చట్టాలలో, కాదని నిరూపిన అయ్యే వరకూ మగాడు దోషే. నిర్దోషత్వాన్ని నిరూపించుకునే భాధ్యత అతనిదే. అంతే కాదు, దుర్వినియోగం చేసిన స్త్రీకి ఎలాంటి శిక్షా ఉండదు.
కాకపోతే, ఈ చట్టాలు మరీ బొమ్మ, బొరుసు వేసినట్టుగా కాకుండా ఒక పద్దతి ప్రకారం విచారణ జరిపేలా చేస్తాయి. కానీ, జెండర్ సెన్సిటివిటీ, స్త్రీల సమస్యల పట్ల అవగాహన అన్న పేరుతో మీడియాని, పోలీసులనూ స్త్రీవాదులు ఎప్పటికప్పుడు బ్రయిన్-వాష్ చేస్తూ ఉంటారు. వీరికి జెండర్ సెన్సిటివిటీ ప్రోగ్రాములు ఇస్తుంటారు. వారు కానీ పొరపాటున స్త్రీలు దీన్ని దుర్వినియోగ పరిచే అవకాశముంది అనో, లేదా మగవారిపై కుడా గృహహింస జరిగే అవకాశముంది కదా అనో అభిప్రాయాన్ని వ్యక్తపరిచితే, వారికి Gender Sensitivity లేదనితేల్చి పారేస్తారు. Gender Sensitivity మీద వారందరికీ అవగాహన ఉండాలని డిమాండు చేస్తారు. ఈ తరహా Gender Sensitivity లేదని వాపోయే స్త్రీవాదులను మనం తరచూ చుస్తూనే ఉంటం. అంటే వీరు వివక్షాపూరిత చట్టాలు రూపొందించడముతో ఆగడం లేదు, వివక్షాపూరిత వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నారు. ఇక మగాడికి న్యాయం ఎలా జరుగుతుంది (హీన పక్షం కనీసం అన్యాయం జరగకుండా ఎలా ఉంటుంది).
అందుకేనేమో రేణుకా చౌదరి ఒకానొక సందర్భంలో “It’s time for men to suffer” అంటూ జాతీయ ఛానెలులోనె చెప్పారు.
P.S: భారతదేశములో ఉండే మగాళ్ళందరికీ, ఆమాటకొస్తే గృహహింస నిరోధక చట్టంలాంటీ చట్టాలు అమలవుతున్న దేశాలన్నింటిలోని మగాళ్ళందరూ తప్పకుండా పాటించాల్సిందేమిటంటే, ” ఎట్టి పరిస్థితులలోనైనా సరే ఇల్లు కొనడం అనే పనిని మానుకోవాలి”. ఇల్లు అనేది మగాడి ఆస్తికాదు. అదెప్పుడో స్త్రీల ఆస్తిగా మారిపోయింది. నీది కాని దానికోసం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును EMIలు కట్టడానికో, ఇల్లు కట్టడానికో వెచ్చించడం ఏమాత్రం వివేకవంతమైన పనికాదు.
So Never Buy A Home.
No comments:
Post a Comment