ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా
అడిగింది.అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నవంట
కదా!ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను?
దానికి భగవంతుడు చిరునవ్వుతో నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఆమె
నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీ కోసం ఆడుతుంది, పాడుతోంది.
నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది. నిన్ను ఎల్ల వేళలా ఆనదంగా ఉంచుతుంది.
నన్ను గుర్తుకురాకుండా చేస్తుంది. వెరసి నీ ప్రతి ఒక్క విషయంలోనూ తను
ఉంటుంది మరి నాకు అక్కడ భాష రాదు కదా మాటలు ఎలా అర్ధం చేసుకోను? నాకు ఏదైనా
ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు? అని అడిగింది పాప. నువ్వు మాట్లాడకపోయినా
నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు. అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది. ఆ
దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుకొంటుంది. అన్నాడు
భగవంతుడు. మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను? నీ దేవత రెండు
చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్దించాలో
చెబుతుంది. నీలో ఉన్డే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతోంది అన్నాడు. ఆ క్షణంలో
స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది. భూలోకం నుంచి వేదనాద ధ్వనులు వినిపించాయి.
అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ.... నా దేవత పేరేంటి అని అడిగింది. ఆ
దేవత పేరు అమ్మ అని సమాధానమిచ్చాడు భగవంతుడు. పదాలు తెలియని పెదవులకుఅమృత
వాక్యం ‘అమ్మా’ఆమె చల్లని ఒడిలో మొదలైంది ‘ఈ జన్మ’ పసిపాప బోసి నవ్వుల కోసం
తల్లి అయినది ఓ నేస్తం పంచ ప్రాణాలు పాపాయి కోసం పంచి ఇచ్చింది ,తన రక్తం
బుజ్జి బుజ్జి పాపయికి బుజ్జగింపునకు జోలపడింది కోటి ఆశల చిన్న పాపయికి
జన్మ నిచ్చింది చందమామనే మేనమామగా చేసింది జాబిలినే భువికి రమ్మంది కమ్మని
కథలెన్నో చెప్పింద ఆది గురువై అక్షరం నేర్పిందిఈ జీవితంలో నా ప్రియ
నేస్తం’అమ్మ’ ఆమె లేకుండ ఉండేదా’ఈ జన్మ’ అందుకే తల్లి ఋణం తీర్చలేం ఆమెకు ఈ
జన్మ అంకితం సదా కన్న తల్లి దేవత ఈ జీవితానికి ఆమే విధాత..
No comments:
Post a Comment