తెలుగు అమ్మాయిలు
కొంచెం అందం
కొంచెం ప్రేమ
కొంచెం ఒద్దికతనం
కొంచెం కొంటెతనం
కొంచెం అనురాగం
కొంచెం చలాకీతనం
కొంచెం కోపం
కొంచెం జాలి
కొంచెం స్వార్ధం
కొంచెం పెంకితనం
కొంచెం గర్వం
కొంచెం నేర్పరితనం
అన్నీ సమపాళ్ళలో కలిసిన
కలికి చిలకల కొలుకులు
పంచదార బొమ్మలు
కొండపల్లి బొమ్మలు
మన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలు..
అలిగిన వేళల్లో అలకనందాదేవి రూపాలు
కోపం వచ్చినప్పుడు కాళికాదేవి రూపాలు
జాణతనం ప్రదర్శనలో సత్యభామ రూపాలు
ప్రేమానురాగాలు కురిపించడం లో అమ్మలగన్న అమ్మలు
తిట్లైనా, పంచబక్ష్య పరవాన్నాలైనా
కడుపు నిండే దాకా తన్ని మరీ తినిపించడంలో అన్నపూర్ణమ్మలు
మన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలు..
తమ ప్రియుల పలుకులలో శంకరాభరణ రాగంలో
సప్తస్వరాలను పలికించగలరు
తమ ప్రియుల హృదయపు లోగిలిలో సత్యభామలై
భామా కలాపం ప్రదర్శించగలరు
తమ ప్రియుల చేత శివతాండవాన్నీ చేయించగలరు
తమ ప్రియుల హృదయాలలో ఊహాప్రేయశిగా తిష్ట వేసి
వారిచేత కాళిదాసు కన్నా గొప్పగా కవిత్వమూ చెప్పించగలరు
తమ ప్రియుల హృదయాలలో స్వప్నసుందరిగా కొలువుదీరి
చిత్రములనూ వేయించగలరు
మన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలు..
No comments:
Post a Comment